![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ - 1006 లో.. రాజీవ్, శైలేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. నువ్వు ఏం చేయలేవని రాజీవ్ ని శైలేంద్ర రెచ్చగొడతాడు. అది చేస్తా ఇది చేస్తా అని అనడం తప్ప నీ వల్ల ఏమీ కాదని శైలేంద్ర అనగానే.. మాట విని నా వెంట వచ్చిందా సరే లేదంటే తన వెంట ఎంతమంది ఉన్నా.. తను ఏ పరిస్థితులలో ఉన్నా సరే ఎత్తుకొచ్చేస్తానని రాజీవ్ శపథం చేస్తాడు. అదే మాట మీద ఉండు అని శైలేంద్ర అంటాడు.
డిన్నర్ ఎవరు చేసిన ఒక మనిషికి ఎక్స్ ట్రా వండాలని అనుపమ, వసుధారలతో మహేంద్ర అంటాడు. ఎవరని అనుపమ అడుగగా.. గెస్ట్ వస్తున్నారని మహేంద్ర అంటాడు. మినిస్టర్ గారిని గానీ కాలేజీ లెక్చరర్స్ ని ఏమైనా పిలిచారా అని వసుధార అడుగగా.. లేదని అనగానే అప్పుడే ఎక్స్ క్యూజ్ మి అని మను వస్తాడు. అతడిని చూసి అనుపమ, వసుధారలు షాక్ అవుతారు. ఇక అనుపమని చూసిన మహేంద్ర.. ఏంటి అనుపమ సర్ ప్రైజ్ అవుతావనుకుంటే షాక్ అయ్యావేంటని అడుగుతాడు. ఇక మనుని లోపలికి పిలుస్తాడు. నేను ఇంటికి రావడం వీళ్ళకి ఇష్టం లేదా సర్ కనీసం కూర్చోమని కూడా అడగట్లేదని మహేంద్రతో మను అంటాడు.అదేం లేదండి ఇంటికి ఎవరు గెస్ట్ గా వచ్చిన వారికి మర్యాదలు చేయడం మా సంప్రదాయమని వసుధార చెప్తుంది. ఇక మీరు మాట్లాడుతుండండి నేను డిన్నర్ రెడీ చేస్తానని అనుపమ అక్కడి నుండి వెళ్తుంది. నాకు తెలుసు అనుపమ.. నీకు మను మధ్య ఏదో గతం ఉందని నాకు తెలుసు. అది బయటపెట్టడానికే మనుని డిన్నర్ కి పిలిచానని మహేంద్ర మనసులో అనుకుంటాడు. ఇక మనుని కూర్చోబెట్టి మహేంద్ర మాట్లాడుకుంటాడు. ఇంట్లో ఎవరెవరు ఉంటారని మను అడుగగా.. ఫస్ట్ నేను జగతి, రిషి, మహేంద్ర, వసుధార ఉండేవాళ్ళమని కానీ కొంతకాలం క్రితం జగతి చనిపోయిందని, రిషి ఏమైపోయాడో తెలియదని మహేంద్ర భాదపడుతుంటాడు. ఆ తర్వాత అనుపమ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుందని ఒక్కోరోజు ఇక్కడే ఉంటుందని మనుతో మహేంద్ర చెప్పగా అవునా అని అంటాడు. నువ్వు మాకు గొప్ప సాయం చేశావు.. నీ గురించి చెప్పలేదు మీ అమ్మనాన్న ఎవరని మనుని గుచ్చిగుచ్చి అడుగుతాడు మహేంద్ర. ఎక్కడ నిజం చెప్పేస్తాడేమోనని వంటగదిలో ఉన్న అనుపమ పరుగున వచ్చి అవన్నీ ఇప్పుడు ఎందుకని మహేంద్రతో అంటుంది.
ఇక కాసేపటికి నీకు వంటల్లో ఏం ఇష్టమని మహేంద్ర అడుగగా.. చిక్కుడుకాయ, ముద్దపప్పు అని మను అంటాడు. ఇంకా అని మహేంద్ర అడుగగా.. ఆలు ఫ్రై అని అనుపమ అంటుంది. ఆలు ఫ్రై ఆ .. ఏంటి అనుపమ అనగానే...ఆలు ఫ్రై ఇష్టమే అని మను అంటాడు. అంత కరెక్ట్ గా నీకెలా తెలుసు అనుపమ అని మహేంద్ర అడుగగా.. జనరల్ గా అందరు ఆలయ ఫ్రైని ఇష్టపడతారు కదా అని అనుపమ కవర్ చేస్తుంది. ఆ తర్వాత అవే ప్రిపేర్ చేస్తామని అనుపమ, వసుధారలు కిచెన్ లోకి వెళ్తారు. మను, మహేంద్ర ఇల్లు చూడటానికి వెళ్తారు. కాసేపటికి రాజీవ్ వాళ్ళింటికి వస్తాడు. నా మరదలు పిల్ల ఎక్కడా అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు. అది విని ముందు అనుపమ వస్తుంది. రాజీవ్ ని చూసి ఎవరు నువ్వు అని అనుపమ అడుగగా.. ది గ్రేట్ రాజీవ్ .. వసుధారకి బావని అంటాడు. ఆ వెదవవి నువ్వేనా అని అనుపమ అంటుంది. ఇక కాసేపటికి వసుధార రాగా తన చేయి పట్టుకొని లాక్కెళ్ళాలని చూస్తే అప్పుడే మను వస్తాడు. ఏంటి భయ్యా నువ్విక్కడ.. మా విలన్లని బ్రతకనివ్వరా. మేము ప్రతీ గంట పని ప్లాన్ చేసుకొని పని చేసుకోవాలి ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మా మరదలిని తీసుకోవడానికి వస్తే నువ్వేంటని మనుతో రాజీవ్ అంటాడు. నాటకాలాడొద్దు.. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు.. నీకు ఆరోజే వార్నింగ్ ఇచ్చాను.. పోయినసారి గన్ మాత్రమే చూపించాను ఈసారి బుల్లెట్లు చూపిస్తానని రాజీవ్ తో మను చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |